భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విదేశీ శాటిలైట్స్‌ను ప్రయోగించడం ద్వారా 279 మిలియన్ డాలర్ల ఆదాయం పొందిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం నాడు లోక్‌సభలో తెలిపారు. ఇస్రో శాటిలైట్ లాంచ్ వేహికల్ పీఎస్‌ఎల్‌వీ ద్వారా 34 దేశాలకు చెందిన 345 విదేశీ శాటిలైట్స్‌ను ప్రయోగించింది. దీని ద్వారా ఇస్రో 56 మిలియన్ డాలర్లు, 220 మిలియన్‌ల యూరోలు ఆదాయం వచ్చింది.
220 మిలియన్ యూరోలు 223 మిలియన్ డాలర్లతో సమానం. ఇటీవల జూన్ 30న సింగపూర్‌కు చెందిన మూడు శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ53 పూర్తిగా వాణిజ్యపరమైన కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు మంత్రి వివరించారు. దీని ద్వారానే విదేశీ శాటిలైట్స్‌ను ప్రయోగిస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.