Friday, November 22, 2024

బంగ్లాదేశ్‌ కాళీ ఆలయంలో పూజలు.. ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌

ఢాకా : బంగ్లాదేశ్‌లోని అతి పూరతనమైన.. ఎంతో ప్రాముఖ్యత కలిగిన.. పునర్‌ నిర్మించిన శ్రీ రమ్నా కాళీ ఆలయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు ప్రారంభించారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌ ఆహానం మేరకు రాష్ట్రపతి ఆ దేశంలో పర్యటిస్తున్నారు. శుక్రవారంతో ఆయన పర్యటన మూడో రోజుకు చేరుకుంది. ఆలయం ప్రారంభించిన తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు కోవింద్‌ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1971 లిబరేషన్‌ వార్‌లో పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ సాతంత్య్రం పొందిన తరువాత ప్రతీ ఏటా బంగ్లాలో విజయ్‌ దివస్‌ నిర్వహిస్తారన్నారు. స్వాతంత్య్రం పొందిన బంగ్లా.. 50 ఏళ్ల గోల్డెన్‌ జూబ్లిd ఉత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. భారత్‌-బంగ్లా ప్రజల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధానికి ఈ ఆలయం నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఆలయం పునర్‌ నిర్మాణంలో భారత్‌ ప్రభుత్వం పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement