బెంగళూరు: ఐపీఎల్ మెగావేలం 2022 ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. 12వ తేదీ ఉదయం 11నుంచి వేలంపాట జరగనుంది. ఈ మెగావేలాన్ని స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్ సంస్థ వివో ఒప్పందం ముగిసింది. దీంతో ఈ ఏడాది నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు స్వదేశానికి చెందిన టాటా గ్రూప్ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
ఇకపై ఐపీఎల్‌ను టాటా ఐపీఎల్‌గా వ్యవహరించనున్నారు. 12వ తేదీన మొదలయ్యే మెగావేలంలో మొత్తం 590మంది క్రికెటర్లు కోసం పోటీ జరగనుంది. వీరిలో 228మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా మరో 355మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొత్తగా ఐపీఎల్ 15వ సీజన్‌లో అరంగేట్రం చేయనుండటంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..