Friday, November 22, 2024

రూపాయిపై యుద్ధ ప్రభావం తక్కువే..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం రూపాయిపై నామమాత్రంగా ఉండవచ్చని.. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే ఫారెక్స్‌ అస్థిరతలు డాలర్‌/రూపాయికి సంబంధించి ప్రస్తుతం తక్కువగానే ఉన్నట్టు ఎస్‌బీఐకి చెందిన ఎకోరాప్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. రెండు దేశాల మధ్య వివాదం తాత్కాలికంగా రూపాయిని కిందకు తీసుకెళ్లొచ్చంటూ అంచనా వేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో రూపాయి 2008 జనవరి నుంచి 2011 జూలై మధ్య కాలంలో 13 శాతం నష్టపోయింది. సంక్షోభం తర్వాత రూపాయిలో అస్థిరతలు పెరిగిపోయాయి.

2011 జూలై నుంచి 2013 నవంబర్‌ మధ్య 41 శాతం పడిపోయింది. కానీ ఈ విడత రూపాయిలో అస్థిరతలు చాలా తక్కువగా ఉన్నాయని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక వివరించింది. మరోవైపు ఫారెక్స్‌ మార్కెట్లో ఆర్‌బీఐ చురుగ్గా వ్యవహిరిస్తోందని, రూపాయికి మద్దతుగా నిలుస్తోందని తెలిపింది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.76.53 వద్ద ఉంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement