ఓ యువకుడు తన భార్యను తరచూ వేధిస్తుండడంతో ఆ భర్త అతన్ని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ యువకుడు అతని భార్యపై వేధింపులు ఆపకపోవడంతో ఆ యువకుడిని హత్య చేసి, శవాన్ని కాల్చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కంబాలహళ్లి గ్రామంలో జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర్ వాసి తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణతో ఓ యువకుడిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రాత్రికి రాత్రే కాల్చి బూడిద చేశాడు. శంకర్ (28) తరచుగా అశోక్ భార్యను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయంలో శంకర్‌ను అశోక్ పలుమార్లు హెచ్చరించాడు. అయినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అశోక్.. శంకర్‌ను పదునైన ఆయుధంతో చంపేసి, శవాన్ని కాల్చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను వేధిస్తున్న యువకుడిని చంపిన భర్త
Advertisement
తాజా వార్తలు
Advertisement