Monday, November 18, 2024

California : భార్యపై కోపంతో భర్త కాల్పులు.. ఐదుగురు మృతి

కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. భార్యపై కోపంతో భర్త కాల్పులకు పాల్పడిన ఘటన కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలోని ప్రముఖ బైకర్స్‌ బార్‌ వద్ద చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

నిందితుడు రిటైర్డ్‌ పోలీసు అధికారి అని అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తనను దూరం పెడుతున్న భార్యను లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కాల్పులు జరగ్గా.. నిందితుడు సహా ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement