మనుషులలో రోజురోజుకీ మానవత్వం మంటగలిసి పోతుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ మానవత్వం బయటకు రావట్లేదు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసే నాగ లక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అయితే నాగలక్ష్మి కరోనాతో మరణించి ఉండవచ్చునని భావించి స్థానికులు.. ఎవరు కూడా ఆమె మృతదేహం వద్దకు రాలేదు. కనీసం ఆటోలో ఆయిన భార్య మృతదేహన్ని తరలించాలని ఆటో డ్రైవర్లను కూడా ఆమె భర్త ప్రాధేయపడగా వారు కూడా నిరాకరించారు. చివరికి చేసేది లేక భార్య మృతదేహాన్ని భర్త స్వామి తన భుజాలపై ఎత్తుకుని మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటికకు తరలించాడు. ఈ ఘటన తెలుసుకున్న రైల్వే పోలీసులు, కొంత మంది స్థానికులు కలిసి 2500 రూపాయలను అంత్యక్రియల నిమిత్తం నాగలక్ష్మి భర్త స్వామికి అందజేశారు. శ్మశాన వాటికలో ఖర్చుల కోసం భార్య మృతదేహంతోనే మార్గమధ్యంలో స్వామి భిక్షాటన చేయడం గమనార్హం. ఈ ఘటన గురించి తెలుసుకున్న వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు.
మానవత్వం చచ్చిపోయింది.. భార్య మృతదేహాన్ని మూడున్నర కిలోమీటర్లు భుజాలపై మోసిన భర్త
Advertisement
తాజా వార్తలు
Advertisement