కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు అప్పుడే అడ్మిషన్ల వేట షురూ చేయి. ఇంకా పదో తరగతి ఫలితాలే రాలేదు. అప్పుడే తమ అడ్డగోలు ఫీజుల దోపిడీకి తెరలేపారు. తమకాలేజీలో అంటే తమ కాలేజీల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారాలను నిర్వహిస్తు న్నారు. ఈ ఏడాది పదో తరగతి చదువు పూర్తయిన విద్యార్థుల వివరాలు, ఫోన్ నెంబర్లను తెలుసుకుని అక్కడ డేగల్లా గా వాలిపోతున్నారు. తమ కాలేజీలో చదివిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ఒకవైపు కరో
నా కారణంగా రద్దయిన పదో తరగతి ఫలితాలను ఏ విధంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం తర్జనభర్జనపడుతుంటే మరోవైపు ఫలితాలు రాకముందే అడ్మిషన్ల కోసం వేట మొదలు పెట్టేశారు. తమ మాటల గారడీతో విద్యార్థుల తల్లి
దండ్రులకు నమ్మబలికించి ఆఫర్లతో ఎరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్లో చేరేవారికి సంవత్సరానికి దాదాపు రూ.80వేల నుంచి రూ1.20లక్షల వరకు వసూలు చేస్తు
న్నారు. ముందస్తుగా అడ్మిషన్ బుక్ చేసుకుంటే 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ బుట్టలో వేసుకునే పనిలో కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు నిమగ్నమయ్యాయి. ‘మీ అమ్మాయికి ఏ గ్రేడ్ వస్తుందనుకుంటున్నారు. మీ అబ్బాయికి ఏ కోర్సులో చేర్పించాలని నిర్ణయించుకున్నారు.
మా కళాశాల ఇంటర్ విద్యలో ఎంతో అనుభవంకలిగిఉంది.అనుభవంతోపాటు వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన ఆధ్యాప కులచే బోధన చేయిస్తున్నామ’నినమ్మబలికుస్తున్నారుఅంతటితో ఆగకుండా తమకళాశాలలకు ప్రతి ఏడాది మంచి
ర్యాంకులు వస్తున్నాయి. కళాశాలలో సీటుకు రిజర్వేషన్ చేయించుకుంటే ఫీజులో 20 శాతం తగ్గిస్తామని ప్రచారపర్వా నికి కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు శ్రీకారం చుడుతున్నారు. వారి వద్ద అందుబాటులో ఉన్న విద్యార్థుల తల్లి దండ్రుల ఫోన్ నెంబర్లకు ఫోన్లు, మెస్సేజ్ లు చేస్తూ కార్పొరేటు కళాశాలలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. సాధ్యమైనంత
వరకు అడ్మిషన్లు ఈ నెలలోనే పూర్తయ్యేలా పీఆర్వోలకు రంగంలోకి దింపుతున్నారు. విద్యార్థుల తల్లి దండ్రులకు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐఐటీ, జేఈఈ, ఐఏఎస్, ఐపీఎస్
ర్యాంకులను అరేతిలోచూపుతున్నారు. పదో తరగతి విద్యార్థుల జాబితాలను తీసుకున్న కార్పొరేట్ల విద్యాసంస్థలు
వారి తల్లిదండ్రులను ఫోన్లు చేస్తూ ముందుగానే అడ్మిషన్లకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. తమ
నెట్ వర్కను హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు విస్తరించి అడ్మిషన్లు పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అప్పుడే తరగతులూ షురూ!
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ప్రతి రోజూ10వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి పదో, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. వీరిని ఏ విధంగా గ్రేడింగ్ ఇవ్వాలనే దానిపై ఇంకా పూర్తి స్పష్టతనే రాలేదు. అప్పుడే పలు కాలేజీలు ముందస్తు అడ్మిషన్లకు తెరలేపుతున్నాయి. కరోనా ఎప్పుడు తగ్గుతాయో లేదో తెలియని పరిస్థితుల్లో అడ్మిషన్లు మాట్లాడుకోవడం ఎందుకని తల్లిదండ్రులు జాగ్రత్త పడుతున్నారు.