మహానగరం హైదరాబాద్ లో వాయు కాలుష్యమే కాదు..శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. దాంతో నగర ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం
కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నిబంధనలు మరో నెలలోనే అందుబాటులోకి రానున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం అనవసరంగా హారన్ కొట్టే వారిని అత్యాధునిక కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించనున్నారు. అనవసర హారన్ మోతాదును బట్టి వాహనదారుడిపై చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల కింద జరిమానాలు, భారీ జరిమానాలు విధించడంతో పాటు ఏకంగా వాహనదారులను కోర్టులో హాజరుపరిచే దాకా శిక్షలు ఉన్నాయి. ఈ మేరకు మోటారు వాహనాల చట్టంలోని 119 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకుంటున్నారు.
హారన్ కొడితే – భారీ జరిమానా..119సెక్షన్ అమలు
Advertisement
తాజా వార్తలు
Advertisement