Saturday, June 29, 2024

IND vs AUS | ఆసీస్ ని ఉతికారేసిన హిట్‌మ్యాన్.. పలు రికార్డులు బద్దలు

టీ20 ప్రపంచ క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ.. రోహిత్ శర్మ (41 బంతుల్లో 92 ప‌రుగులు) బాడాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అద్బుతన స్టార్ట్ ఇచ్చాడు. ఆది నుంచే ఆకశమే హద్దురా అన్నట్టు బౌండరీలతో విజృంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన‌ ఓవ‌ర్లో రోహిత్ రెచ్చిపోయాడు. వ‌రుస‌గా.. 6, 6, 4, 6, బాది… ఆ ఓవ‌ర్లో 29 ప‌రుగులు రాబ‌ట్టాడు.

పలు రికార్డులు బద్దలు :

  • దీంతో ఈ సీజన్‌లో ఫాస్టెస్ ఫిఫ్టీ (19 బంతుల్లో 50 పరుగులతో) అద్భుత అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
  • టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు.
  • అంతే కాకుండా ఈ టీ20 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ (98) తర్వాత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
  • దీంతో పాటు టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ (4103) రికార్డును రోహిత్ (4150) బద్దలు కొట్టాడు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు (రోహిత్ శర్మ 132 సిక్సర్లు వర్సెస్ ఆస్ట్రేలియా).
  • నేటి మ్యాచ్‌లో రోహిత్ 8 సిక్సర్లు బాది.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిని యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
Advertisement

తాజా వార్తలు

Advertisement