Friday, November 22, 2024

TG | వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్..

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులను సీరియస్‌గా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.

ఈ అంశంపై ధర్మాసనం ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం దృష్టి కేవలం ధనవంతులు నివసించే ప్రాంతాలపైనే కాకుండా.. సామాన్యులు నివసించే మురికివాడలపైన కూడా పెట్టాలని ధర్మాసనం కీలక ఆదేశాలు చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది.

తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నామని.. అప్పటిలోగా కుక్కల దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement