Friday, November 22, 2024

హడలెత్తిస్తున్న హెచ్‌3ఎన్‌2.. భిన్నంగా విజృంభిస్తున్న కొత్త ఫ్లూ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కోవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ… కొత్త ఫ్లూ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నది. ఇన్‌ఫ్లుయెంజా ఎహెచ్‌3ఎన్‌2 కొత్త ఫ్లూ ప్రభావంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పల్లెలు మొదలు పట్టణాల వరకు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ కొత్త ఫ్లూ ప్రభావంతో ప్రస్తుతం ప్రతీ ముగ్గురిలో ఒకరు జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలకు సరైన సమయంలో చికిత్స తీసుకోని పక్షంలో జ్వరం తరువాత న్యుమోనియా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

అలాగే, ఈ ఫ్లూ నుంచి కోలుకున్న తరువాత కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండోచ్చనీ, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగానే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని చెబుతున్నారు. ఈ వైరస్‌ ఇతర ఉప రకాల కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనీ, కానీ, ఏ మాత్రం ప్రాణాంతకం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయని పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారనీ, అందుకే కోలుకోవడానికి కొంత సమయం పడుతున్నదని పేర్కొంటున్నారు.

హెచ్‌3ఎన్‌2 లక్షణాలు….

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయి. కొన్ని కేసులలో ఇవి దీర్ఘకాలికంగా కనిపిస్తాయి. వీటితో పాటు ఒళ్లు నొప్పులు, డయేరియా, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement