రఘునాధపాలెం, ప్రభన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి వేలాది కోట్లు ఖర్చుపెడుతూ వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు అన్నారు. మంగళవారం ఖమ్మం నియోజకవర్గంలో రూ.42.50 కోట్లతో నిర్మిస్తున్న పనులకు వారు శంకుస్ధాపన చేశారు. దీనిలో భాగంగా ఖమ్మం ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లో రూ.1.10 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ భవనం, మండల కేంద్రంలో రూ.20 కోట్లతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న గిరిజన స్కూల్ ఆఫ్ ఎక్స్‌ఎన్సి పాఠశాలకు వారు శంకుస్ధాపన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్రంలో రెసిడెన్షియల్ గురుకులాలు ఏర్పాటుచేసి విద్యార్ధులకు మెరుగైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్స్‌ఎన్సి గిరిజన పాఠశాల రాష్ట్ర కేంద్రమైన హైద్రాబాద్‌లోనే ఉండేదని కాగా రెండవ పాఠశాలను ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలానికి కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 976 గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ఈ రాష్ట్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి పాలించిన పాలకులు అభివృద్దిని పక్కనపెట్టి కేవలం కుంభకోణాలకే పెద్దపీఠ వేశారని అన్నారు. గతంలో గిరిజన తండాల్లో అభివృద్ది లేక అనేక అవస్ధలకు గురయ్యారని, గత పాలకులు ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని తండాలను గ్రామాలుగా ఏర్పాటుచేస్తామని వాగ్ధానం చేసి గిరిజనుల చేత ఓట్లు వేయించుకొని పాలించిన పాలకులు మోసం చేశారని అన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి తండాలను గ్రామాలుగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే వెనువెంటనే రాష్ట్రవ్యాప్తంగా 3,140 తండాలను గుర్తించి వాటిని రగామాలుగా రూపకల్పన చేశారని అన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన గ్రామాలకు నూతన పంచాయతీ భవనాల కోసం గిరిజన సంక్షేమం నుండి ప్రతి పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తానని అన్నారు. అన్నికుల సంఘాల భవనాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించిందని ఆ భవనాల్లో కుల సమీక్ష సమావేశాలతోపాటు శుభకార్యాలు సైతం నిర్వహించుకోవచ్చని అన్నారు.
నూతనంగా ఏర్పాటుచేసిన గిరిజన స్కూల్ ఆఫ్ ఎక్స్‌ఎన్సి పాఠశాల ల కు రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్స్ జరుగుతాయని, దీనికోసం ఆయా ని పుణుల పర్యవేక్షణలో పరీక్షలు నిర ్వహించి దానిలో నైపుణ్యం పొందిన విద్యార్ధులకు సీట్లు భర్తీచేస్తారని అన్నారు. ఈ పాఠశాలలో ఎనిమిది తరగతి నుండి ఇంటర్ వరకు విద్యను బోధిస్తారని, జేఇఇ, నీట్ కోచింగ్ కూడా ఇక్కడ ఏర్పాటుచేస్తారని అన్నారు. తొలుత జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, డి సిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, సుడాచైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాధ్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి విద్యాచందన, జడ్పీటీసీ మాలోత్ ప్రియాంక, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు అజ్మీరా వీరునాయక్, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..