Thursday, November 21, 2024

జ‌మున హ్యాచ‌రీస్ క‌బ్జా చేసిన భూములు హక్కుదారులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయం

వెల్దుర్తి : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హాకింపెట్ అచ్చంపేట గ్రామాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి చెందిన‌ జమునా హ్యాచరీస్ సంస్థ కబ్జా చేసిన భూములను రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వెన్యూశాఖ అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. జ‌మున‌ హ్యాచ‌రీస్ వద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొన‌సాగుతోంది.

హకీంపేట గ్రామాల పరిధిలో నిరుపేదల అసైన్డ్ భూముల కబ్జాకు పాల్పడ్డార‌నే ఫిర్యాదు మేరకు ప్రభుత్వం సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేలో 70 ఎకరాల 32 గుంటల భూమిని కబ్జా చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం తిరిగి అసలైన లబ్ధిదారులైన రైతులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి రైతులకు అప్పగించనున్నారు. సర్వే నెంబర్ 130 లో వేల కోట్లు భవనాలు ఇతర నిర్మాణాలను కూల్చి వేసి రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement