తాండూరు రూరల్ : తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో నందీశ్వరుడు మహిమ చూపించాడు. శుక్రవారం గ్రామంలోని మెయిన్ బజార్ లోని బసవన్న దేవాలయంలోని నందీశ్వరుడు పాలు సేవించాడు. గ్రామానికి చెందిన ఆవటి మల్లు కూతురు పూజ, కోమటి ప్రవీణ్ భార్య స్రవంతిలు దేవాలయంలో నందీశ్వరుడికి పాలు నైవేద్యంగా సమర్పిస్తుండగా అనూహ్యంగా పాలు సేవించాడు. గమించిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వింతపై గ్రామస్తులు అందరు దేవాలయానికి చేరుకుని పరిశీలించారు. నందీశ్వరుడు పాలు సేవించడంపై దైవ మహిమగా అభివర్ణించారు.
- ఇదిలా ఉండగా శుక్రవారం పాలు సేవించిన నదీశ్వరుడు కొలువైన బసవణ్ణ దేవాలయం శనివారం ఉదయం ఆలయ గర్భగుడి తప్ప మిగతా దేవాలయ ప్రాగంణం కుప్పకూలిపోయింది. గత కొన్నేండ్లుగా దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో నందీశ్వరుడే ఆలయ పునర్ నిర్మాణానికి సంకేతంగా దేవాలయాన్ని కూల్చి.. సంకేతం ఇచ్చారని గ్రామస్తులు విశ్వసించారు. దీంతో శనివారం ఆలయ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్, ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, ఎంపీటీసీలు, తదితరులు సమావేశమై ఆలయ పునర్ నిర్మాణ కమిటిని వేసుకునేందుకు నిర్ణయించారు. త్వరలోనే ఆలయ పునర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.