Home తెలంగాణ‌ TG | గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

TG | గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

0
TG | గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

గ్రీన్‌ పవర్ విద్యుత్‌ రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యుటీ సీఎం భట్టి అన్నారు. 2030 నాటికి 20గిగా వాట్ల గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నదని వెల్లడించారు. ఈ నెల 14 – 20 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ పొదుపు వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్‌ అభివృద్ధి సంస్థ అధికారులు రూపొందించిన 2025 విద్యుత్‌ పొదుపు క్యాలెండర్‌ను శుక్రవారం ప్రజా భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….

2030 నాటికి 20 గిగావాట్స్‌ పునరుత్పత్తి విద్యుత్‌, 2035 నాటికి 40గిగావాట్స్‌ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీ-జీ రెడ్కో జిఎం గుప్రసాద్‌, డిప్యూటీ- జనరల్‌ మేనేజర్‌ వెంకటరమణ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version