Friday, November 22, 2024

దేశ ఆర్ధిక అభివృద్ధే ల‌క్ష్యం..

ప్ర‌భ‌న్యూస్ : ఆర్థికాభివృద్ధి విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమం త్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో నిర్మలా సీతారామన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయ్యారు. అనంతరం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. 15 రాష్ట్రాల సీఎంలు, 3 రాష్ట్రా ల డిప్యూటీ సీఎంలు, జమ్మూ లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. పెట్టుబడులు, కరోనాకు ముందు.. ఆ తరువాతి ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు.

దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మరింత పెంపొం దించేందుకు కేంద్రీకృత ఆలోచనలపై, పరస్పర సహకారంతో పాటు అంతర్గత పెట్టుబడి-ఆధారిత వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని ఆమె సూచించారు. రెండంకెల వృద్ధిరేటును నమోదు చేస్తున్నామని వివరించారు. సానుకూల పరిణామాల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించాలన్నారు. పెట్టుబడి ప్రోత్సాహానికి అనుకూలమైన విధానం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా.. పట్టణ స్థానిక సంస్థల్లో అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని నిర్మలా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కరోనా రెండో వేవ్‌ తరువాత.. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని, దీనికి నిదర్శనం జీఎస్‌టీ వసూళ్లే అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్లతో పాటు సమస్యలను ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ, డాక్టర్‌ భగవత్‌ కరాడ్‌, ఫైనాన్స్‌ సెక్రెటరీ డాక్టర్‌ టీవీ సోమనాథన్‌, సెక్రెటరీ డీఈఏ అజయ్‌ సేథ్‌, తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి ఊతం ఇచ్చేలా సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్శించే మార్గాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ సూచించారు. పెట్టుబడులు పెంచేం దుకు అనువైన పర్యావరణ వ్యవస్థను రూపొందించా లన్నారు.

కరోనా మహమ్మారి రెండు విడతలుగా విరుచుకు పడిందన్నారు. దేశ వ్యాప్తంగా కకావికలం అయిన వృద్ధిని ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంస్కర ణలు, పెట్టుబడుల ప్రోత్సాహం నిరంతరం కొనసాగించా లని సూచించారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా పునరుద్ధరణ, మూలధన వ్యయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా వివరించారు. పెట్టుబడులు, డెవలప్‌మెంట్‌, మ్యానుఫాక్చరింగ్‌పై సమస్యలు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement