సదాశివపేట : పేదల కళ్లల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం ఎనిమిదో వార్డ్ లో కంటి వెలుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా హాజరై కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి డాక్టర్లకు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేద ప్రజల సంక్షేమానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అర్హులైన పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి వ్యక్తి కంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా వారికి భవిష్యత్తులో కంటి సంబంధిత వ్యాధులు రావని అన్నారు. సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శ మన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వడ్ల మహేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్లు శతని శ్రీశైలం, విద్యాసాగర్ రెడ్డి చౌదరి ప్రకాష్, మోబిన్, గుండు రవి, కోడూరి అంజయ్య, పట్టణ అధ్యక్షులు చీలమల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, జీటీఆర్ డెవలపర్ తుల్జారం, మన్నె మల్లేశం, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement