Sunday, January 5, 2025

NZB | బాలికలు సేఫ్… గాలించి పట్టుకున్న పోలీసులు !

నవీపేట్, ఆంధ్రప్రభ : జిల్లాలో సంచలనం సృష్టించిన పదవ తరగతి విద్యార్థినుల మిస్సింగ్ ను పోలీసులు ఛేదించారు. గురువారం ఉదయం స్కూల్ కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి అదృశ్యం అయిన కొండపల్లి శిరీష, గడ్డం రవళిక, వరలక్ష్మి లను పోలీసులు 20 గంటలు శ్రమించి పట్టుకున్నారు.

కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు డిసెంబర్ 31 ను కలిసి సెలెబ్రెట్ చేసుకున్న ముగ్గురు స్నేహితులు గురువారం రోజున స్కూల్ కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి నిజామాబాద్ కు వెళ్లారు. స్కూల్ కు రాకపోయేసరికి పాఠశాల ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల వెతికి ఆచూకీ లేకపోవడంతో గురువారం రాత్రి 11 గం.లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న నవీపేట్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడి గాలించగా మొదట ఒక విద్యార్థిని శుక్రవారం వేకువజామున మూడు గంటలకు నిజామాబాద్ బస్టాండ్ వద్ద దొరకగా మరో ఇద్దరని సాయంత్రం 6 గంటల సమయంలో పట్టుకున్నామని, ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు నవీపేట్ ఎస్సై కె.వినయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement