అగ్నివీరుల భవిష్యత్ పూర్తిగా భద్రమేనని, అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీంపై ఎలాంటి అపోహలు వద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భరోసా ఇచ్చారు. రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు. అగ్నిపథ్ స్కీంను సమర్ధించిన అజిత్ దోవల్ యువ, సుశిక్షిత సేనలు సైన్యానికి అవసరమని అన్నారు. రెజిమెంటల్ వ్యవస్ధ యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న హింసాత్మక నిరసనలపై అజిత్ దోవల్ ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసం, హింసాకాండను ఎట్టిపరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అగ్నిపథ్ నిరసనల వెనుక కొందరి స్వార్ధ ప్రయోజనాలు దాగున్నాయని, సమాజంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే కొందరు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. హింసాకాండను ఎవరూ సమర్ధించుకోలేరని అన్నారు. అగ్నిపథ్ నిరసనలపై స్పందిస్తూ హింసాత్మక నిరసనల విషయంలో నిందితులను గుర్తించారని, విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement