ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు పోటీ చేశారు. పోటీ చేసిన నలుగురు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు గెలిచినట్లు డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు. నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. ఆ ఇద్దరిలో ఆర్.కృష్ణయ్యది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం రాళ్లడుగుపల్లి గ్రామం. బీసీ సంఘ ఉద్యమ నేతగా పేరున్న కృష్ణయ్య 2014లో ఎల్బీనగర్‌నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నిరంజన్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా సేవలందిస్తున్న నిరంజన్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులను వాదిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement