Friday, November 22, 2024

నాటి కాకతీయుల స్ఫూర్తితోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభ‌వం : మంత్రి ఎర్ర‌బెల్లి

మహా శివరాత్రి సందర్భంగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంలో, వరంగల్ జిల్లా పర్వతగిరిలోని పర్వతాల శివాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అనంత‌రం రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశా అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్ధశ క‌లిగింద‌న్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టును గత పాలకులు పట్టించుకోలే అని, స్వరాష్ట్రంలో వందల కోట్లతో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నద‌న్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం అన్నారు. నాటి కాకతీయుల స్ఫూర్తి తోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సీఎం కేసీఆర్ కల్పిస్తున్నార‌ని, అభివృద్ధి కూడా అద్భుతంగా జరుగుతుంద‌న్నారు. అందుకే సీఎం కేసీఆర్ ని దేశ ప్రజలు కోరుకుంటున్నార‌న్నారు. ఈ సందర్భంగా మంత్రికి దేవాలయాల అర్చకులు, అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement