Monday, November 18, 2024

తెలంగాణలో అమలవుతున్న అటవీ హక్కుల చట్టం.. ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అటవీ హక్కుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి, ఈ చట్టాన్ని సంబధిత రాష్ట్ర ప్రభుత్వాలే పర్యవేక్షిస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు తెలంగాణలో మొత్తం 97,536 పట్టా భూముల పంపిణీ జరిగిందని వెల్లడించారు.

అయితే గిరిజనుల నిర్వాసితుల వివరాలతో సహా సంబంధిత రాష్ట్రాలు లేదా ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం భూసేకరణకు సంబంధించిన సమాచారం కేంద్రం వద్ద లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంటుందని పేర్కొన్నారు. అడవుల్లో నివాసం ఉండే వారిని ఇప్పటికే అడవుల రక్షణ, పరిరక్షణ ప్రక్రియలో చేర్చామని వెల్లడించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement