Friday, November 22, 2024

Waterl Levels: కృష్ణా నదికి పెరిగిన వరద.. జూరాల నుంచి శ్రీశైలం పరుగెడుతున్న కృష్ణమ్మ!

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరదలు రాగా, ఇటు కృష్ణా నదికి కూడా వరద పోటెత్తుతోంది. దీంతో నారాయణపూర్​ జలాశయం నుంచి జూరాలకు 1.38 లక్షల నీరు విడుదల అవుతోంది.  జూరాలకు ఇప్పటి వరకు 1.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఓపెన్​ చేసి దిగువకు 1.36 లక్షల క్యూసెక్కులు రిలీజ్​ చేస్తున్నారు. ఇక.. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 1.48లక్షల క్యూసెక్కులు, జూరాల నుంచి 1.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి మొత్తంగా 3.11లక్షల ఇన్​ఫ్లో వస్తున్నట్టు తెలుస్తోంది.

పాలమూరు  జిల్లాలోని  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి కాస్త పెరిగినట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టుకు 1.65లక్షల  క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. 23 గేట్లు ఓపెన్​ చేసి స్పిల్​ వే ద్వారా 1.36 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.  పవర్​ హౌజ్​కు 34,392 క్యూసెక్కులు రిలీజ్​ చేస్తున్నారు. అదే విధంగా నెట్టెంపాడు లిఫ్ట్​కు 1500, భీమా లిఫ్ట్​కు 1300, లెఫ్ట్​ మెయిన్​ కెనాల్ (​LMC) ద్వారా 920, రైట్​ మెయిన్​ కెనాల్ (RMC)​ ద్వారా 210, ప్యారలాల్​ కెనాల్​ (Parallel canal ) ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక.. ఆవిరి రూపంలో (Evaporation) మరో 67 క్యూసెక్కుల లాస్​ ఉంది.  జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 8. 029 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4. 322 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా, మొత్తం ప్రాజెక్టు నుంచి అవుట్​ ఫ్లో 1,75,687 క్యూసెక్కులున్నట్టు అధికారులు తెలిపారు.

ఇక.. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 34 వేల 392 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 867.50 అడుగులున్నట్లు అధికారులు తెలిపారు. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను, 131.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది.. కాగా, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 3లక్షల11వేల 448 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement