తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది పరివాహకంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో శ్రీశైలంకు 23వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా, శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 808.9 అడుగులుగా ఉంది. జూరాలకు 41 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 8.75 టీఎంసీలుగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement