Wednesday, November 20, 2024

పంజాబ్​లో ఎగరని బీజేపీపై జెండా, సాగు చట్టాలే కారణం.. రైతులపై పలుచోట్ల కేసులు

మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం.. ఏడాది కాలం తరువాత వాటిని రద్దు చేయడం పంజాబ్‌ రైతులకు నచ్చలేదు. ఢిల్లీ సరిహద్దులో ఎండ, వాన, చలికి తట్టుకుంటూ ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనలకు దిగొచ్చిన బీజేపీ మూడు చట్టాలను ఉప సంహరించుకుంది. అయితే అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. బీజేపీ పట్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే పంజాబ్‌లో గెలుపు కష్టమే అని కమలదళ నేతలకూ తెలుసు. ఎన్నికల సమయంలో మోడీ వచ్చి ప్రచారం చేసినా.. ముందు జై కొట్టినా.. వెనుక మాత్రం విమర్శిస్తూనే ఉన్నట్టు తెలుస్తున్నది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరపైకి తీసుకొచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ఎండగట్టినా.. ప్రజలు బీజేపీని పట్టించుకోలేదు. వ్యవసాయ సాగు చట్టాలే బీజేపీని అధికారానికి దూరం చేశాయని చెప్పుకోవచ్చు. మోడీతో పాటు కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా.. ఓటర్లందరూ.. అలా విని.. ఇలా వదిలేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. సాగు చట్టాల రైతు ఉద్యమ సమయంలోనూ.. పంజాబ్‌ రైతులను కేసుల నమోదు అంశం కూడా వారిని బాధించింది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొంత మంది ప్రతికూల వాతావరణానికి తట్టుకోలేక చనిపోయారు. ఇవన్నీ బీజేపీ ఓటమికి కారణాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement