Wednesday, November 20, 2024

TG | పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం.. తప్పిన ప్రమాదం !

మాదాపూర్‌లోని తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. సిద్దిక్ నగర్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలించారు.

అయితే ఆ బిల్డింగ్ పక్కనే మరో భవనం నిర్మాణం చేపట్టగా.. పెద్ద గుంత తవ్వడంతో పక్కనే ఉన్న ఐదంత‌స్తుల భవనం పక్కకు ఒరిగిపోయినట్లు గుర్తించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భవనం‎లో నివసిస్తోన్న వారితో పాటు.. బిల్డింగ్ చుట్టుపక్కను ఉన్న వారిని కూడా అధికారులు ఖాళీ చేయింస్తున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుని ముందస్తు చర్యల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement