Thursday, November 21, 2024

జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతం, ఆర్థిక శాఖ అంచనా 6.9 శాతం

దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారినట్టే కనిపిస్తున్నది. మొన్నటికి మొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. మార్చిలో నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్‌లో ఇది మరింత పైకి ఎగబాకింది. ఏప్రిల్‌లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.44 శాతం, 6.67 శాతం మేర పెరిగింది. ఈ పెరుగుదల ఫలితంగా.. కన్జ్యూమర్‌ ఇండెక్స్‌ నంబర్‌ను కూడా సవరించాల్సి వచ్చింది. ఏ నెలకానెల పెరుగుతూ వస్తోన్న ద్రవ్యోల్బణం తీవ్రత మరింత పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై పడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వేసి అంచనాల కంటే తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.9 శాతంగా నమోదవుతుందని కేంద్రం తొలుత అంచనా వేసింది. ఈ విషయాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంచనాల్లోనూ పొందుపర్చింది.

అనంతరం దీన్ని పున:సమీక్షించింది. పున: సమీక్షించిన అంచనా (రివైజ్డ్‌ ఎస్టిమేషన్స్‌) ప్రకారం.. జీడీపీలో ద్రవ్యలోటు 6.9 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ అంచనాలు కూడా తప్పాయి. జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. అంచనాలు భారీగా తప్పాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు సంబంధించిన వివరాలను కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆవిష్కరించింది. ద్రవ్యలోటును ప్రొవిజినల్‌గా రూ.15,86,537 కోట్లుగా పేర్కొంది. రెవెన్యూ లోటు 4.37 శాతంగా గుర్తించింది. ఇది వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగి, గోధుమ, కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణానికి దారితీసినట్టు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ కార్మిక రంగంలో 19 రాష్ట్రాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఇందులో 1 నుంచి 20 పాయింట్ల వరకు పెరుగుదల నమోదైంది. కేరళ గరిష్టంగా 20 పాయింట్లను రికార్డు చేసింది. గ్రామీణ కార్మిక కేటగిరిలో కేరళ, పశ్చిమ బెంగాల్‌ సంయుక్తంగా 19 పాయింట్లను అందుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement