జనవరి నెలాఖరు నాటికి.. ఒమిక్రాన్ వైరస్‌తో కూడిన కరోనా కేసుల సంఖ్య రోజుకు 10లక్షలు నమోదు కావొచ్చని పరిశోధన సంస్థ ఐఐఎస్‌సీ-ఐఎస్‌ఐ నిర్వహించిన తాజా మోడలింగ్ అధ్యయనంలో తేలింది. ఈ నెలఖారుకు కరోనా మూడో వేవ్ ప్రమాదకర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని కూడా హెచ్చరించింది. ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ పరిశోధనలో ఇదే విషయం వెల్లడైంది. దీంతో ఈ నెలాఖరుకు కరోనా మూడో వేవ్ పీక్‌కు చేరడం ఖాయమని తేలిపోయింది. భారత్‌లో కరోనా మూడో వేవ్ గరిష్ట స్థాయి జనవరి చివరి వారం నుంచి మొదలై.. ఫిబ్రవరి తొలి రెండు వారాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే వివిధ రాష్ట్రాలు వేర్వేరు స్థాయిలు కలిగి ఉంటాయని కూడా తాజా నివేదికలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో మూడో వేవ్ గరిష్ట స్థాయి జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య వరకు మారుతూ ఉంటుందని తెలుస్తోంది. భారతదేశానికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుదల మార్చి ప్రారంభం నాటికి ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని కరోనా టాస్క్‌ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ తెలిపారు. రెండో దశలో రోజుకు 4లక్షల కేసులు నమోదయ్యాయన్న ఆయన.. మూడో దశలో 10 రోజుల్లోనే లక్ష కేసులకు చేరాయని వివరించారు. పకడ్బందీ చర్యలతోనే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital