Saturday, November 23, 2024

Follow up : నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేటు రాకెట్‌.. హైదరాబాద్‌ స్టార్టప్‌ స్కై రూట్ త‌యారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 11.30నిమిషాలకు విక్రమ్‌ ఎస్‌ రాకెట్‌ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. విక్రమ్‌ సారాభాయ్‌ పేరు మీద దీనికి విక్రమ్‌ ఎస్‌ అని రాకెట్‌కు నామకరణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ స్కై రూట్‌ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ కొత్త చరిత్రను లిఖించినందుకు చాలా గర్వంగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ రాకెట్‌ పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్‌లను కక్షలోకి తీసుకెళ్లింది.

వాటిలో భారత్‌, అమెరికా, సింగపూర్‌, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్‌ అయిన ఫన్‌ శాట్‌ చెన్నైకి చెందిన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ కిడ్జ్‌ ఉన్నాయి. ఈ మిషన్‌ ద్వారా దేశంలో అంతరిక్షంలోని రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థగా స్కై రూట్‌ అవతరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement