ప్రొకబడ్డి లీగ్ (పీకేఎల్)-2022 వచ్చే నెల (అక్టోబర్)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ తొలి దశ షెడ్యూల్‌ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్ ్స పత్రికా ప్రకటన విడుదల చేసింది.
లీగ్ ఆరంభం
డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లి కేసీ, ముంబాయి మధ్య మ్యాచ్ తో అక్టోబర్ 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేపనుంది. అదే రోజు బెంగుళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడనున్నాయి.
మొదటి దశలో భాగంగా అక్టోబర్ ఏడునుంచి నవంబర్ 8 వరకు 66 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్‌లో లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతోంది.
ఇక వీవో పీకెఎల్ సీజన్ 9 దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్ ్స హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గో స్వామి మాట్లాడుతూ బెంగుళూరు, పూణ, హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్‌కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తామని పేర్కొన్నారు.
వివో ప్రొకబడ్డీ లీగ్ సీజన్ -9ను స్టార్ స్పోర్ట్ ్స నెట్ వర్క్, డిస్నీ, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.