ప్రపంచ స్థాయిలో భారతీయ రైల్వే నిర్మించి మొదటి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్.. సెంట్రలైజ్డ్ ఏసీతో విమానాశ్రయం లాగానే ఉండే ఈ మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ బెంగళూరులో అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు సిటీలోనే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ స్టేషన్‌లో ఇవ్వాల (సోమవారం) రాత్రి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. బయప్పనహళ్లి వద్ద రూ.314 కోట్లతో నిర్మించిన సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ను ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభించి.. తర్వాత ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బనస్‌వాడీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే మూడు జతల రైళ్లను సర్ విశ్వశ్వరయ్య టెర్మినల్‌కు సౌత్ వెస్ట్రన్ రైల్వే మార్చింది.
రైల్వే బోర్డు ఇప్పటికే 28 జతల సుదూర రైళ్లను కొత్త టెర్మినల్‌కు మార్చడానికి ఆమోదించింది.. అయితే ఇది దశలవారీగా ఉంటుంది. బనస్వాడి, కంటోన్మెంట్, కేఆర్ పురం వంటి స్టేషన్ల నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్, అసో, త్రిపుర వంటి ప్రాంతాలకు రైళ్లను తొలి దశలో తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో యశ్వంత్‌పూర్, కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ల నుంచి కొన్ని రైళ్లను అక్కడికి తరలించనున్నారు. తాజాగా టెర్మినల్ ముందు భాగం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా ఉంటుంది. ఇక్కడ నుంచి రోజూ 50,000 మంది ప్రయాణించవచ్చు. దాదాపు 30 జతల దూరప్రాంత రైళ్లను దశలవారీగా సర్ ఎంవీ టెర్మినల్‌కు తరలించే అవకాశం ఉందని ఎస్‌డబ్ల్యూఆర్ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.