ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈవీలవైపు అడుగులు వేస్తోంది. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఈ మార్పు ఇంకాస్త వేగంగానే జరుగుతోంది. ఆటో సంస్థలు అన్ని అటు 4 వీలర్స్, ఇటు 2 వీలర్స్ ఈవీలను టచ్ ఇస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఇక దేశంలో క్రేజీగా క్రేజ్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ సైతం ఈవీవైపు అడుగులు వేస్తోంది. ఈవీ సెగ్మెంట్లోకి మరో 18- 24 నెలల్లో ఈ సంస్థ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2024 చివరి నాటికి ఇండియా రోడ్ల మీద రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఈవీ మోడల్ తిరుగనుంది.
భారీగా పెట్టుబడులు..
ఈవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్స్ ప్రారంభించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్. ఇందులో భాగంగానే ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మాజీ సీటీఓ ఉమేశ్ కృష్ణప్పను తమ బోర్డులో చేర్చుకుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్ వృద్ధి కోసం ఇండియా, యూకేలో ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈవీ సెగ్మెంట్‌పై అదనంగా 150మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏడాదికి 1.2లక్షలు- 1.8లక్షల మధ్యలో ప్రొడక్షన్ చేయగలిగే సామర్థ్యాన్ని సాధించేందుకు చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫామ్‌ను తయారు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు సమాచారం. ఇక 2024లో సంస్థ నుంచి తొలి ఈవీని లాంచ్ చేయాలన్న పట్టుదలతో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నట్టు తెలుస్తోంది.