Saturday, September 28, 2024

మత్తు నుంచి విముక్తికి మొదటి డి అడిక్షన్ సెంటర్..ఎక్క‌డో తెలుసా..

తిరుపతి (ప్రభ న్యూస్‌): మత్తు పదార్థాల నుండి విముక్తికి అందుబాటులోకి వచ్చిన మత్తు పదార్థ వ్యసన నిర్మూలన కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి కెనడి నగర్ పూర్వ తమిళ్ స్కూల్ ప్రాంగణంలో సోమవారం మత్తు పదార్థ వ్యసనపరులకు చికిత్సనందించే, డి అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగ ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మత్తు పదార్థాలు మద్యం, డ్రగ్స్,గంజాయ్ లాంటి వాటికి అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకుంట్టున్న వారికి ఈ డి అడిక్షన్ సెంటర్ ఓక వరంలాంటిదని, తాను మత్తు వ్యసనపరులకి ఆధునిక చికిత్స, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు డి అడిక్షన్ సెంటర్ కావాలని సూచించగా, కౌన్సిల్ అనుమతితో ఏర్పాటు చేసినందుకు మేయర్ శిరీషా,కమిషనర్ గిరీషాలను ఎమ్మెల్యే భూమన అభినందిచారు.

మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ మత్తు వ్యసనపరులు తాను నాశనమవ్వడమే కాకుండ వారి కుటుంబాన్ని,సమాజాన్ని నాశనం చేయడం జరుగుతున్నదని, మత్తును వదిలించేందుకు ఈ డి అడిక్షన్ సెంటర్ చాలా ఉపయోగపడుతుందన్నారు. కమిషనర్ గిరీషా ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుచేయడం రాష్ట్రంలోనే మొదటిసారన్నారు. ఈ డి అడిక్షన్ సెంటర్లో మత్తు వ్యసనపరులకు కౌన్సిలింగ్ ఇప్పించడంతోపాటు ఇన్ పేషంట్ గ చేర్చుకొని చికిత్స అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు,ఆంజినేయులు, తమ్ముడు గణేష్, నరసింహాచారి, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, డిఈ సంజయ్ కుమార్,డి అడిక్షన్ సెంటర్ డాక్టర్ ఆశా, శానిటరి సూపర్ వైజర్ సుమతి, వైసిపి నాయకులు దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, మల్లం రవి, డిష్ చంద్ర, తాళ్ళూరి ప్రసాద్, ఈతమాకుల సురేష్ యాదవ్ , అమరనాధ్ రెడ్డి,గీత, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement