Friday, November 22, 2024

IPL | చెన్నై వేదికగా ఫైనల్స్.. బీసీసీఐ అదిరే ప్లాన్ !

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌ను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడంతో ప్లేఆఫ్ మ్యాచ్‌లు గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ హోమ్ గ్రౌండ్‌లో నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరిస్తోందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గుర్తు చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఒక క్వాలిఫయర్ మరియు ఒక ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుండగా.. చెన్నై చెపాక్ స్టేడియంలో ఫైనల్‌తోపాటు ఒక క్వాలిఫైయర్ మ్యాచ్‌ను నిర్వహిస్తారని తెలుస్తోంది.

అయితే ధోనీకి వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తొంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలను వదిలిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరితే, ధోనీకి గ్రాండ్ వీడ్కోలు పలికేందుకు సీఎస్‌కే, ధోనీ అభిమానులకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement