Sunday, January 5, 2025

IND Vs AUS | ఆఖరి టెస్ట్.. ప‌రువు కోసం భార‌త్ పోరు !

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్ లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక జనవరి 3న ఐదో ఆఖ‌రి టెస్ట్ ప్రారంభం కానుంది.

కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది.

మ‌రోవైపు చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని కంగారులు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఐదో టెస్టు ఉత్కంఠ రేపుతోంది. ఇక ఐదో టెస్ట్ కు ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 నుంచి ఫామ్‌లో లేని మిచెల్ మార్ష్ తప్పించనున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రకటించాడు. మిచెల్ మార్ష్ స్థానంలో వెబ్‌స్టర్ తీసుకుంటామని వెల్లడించాడు. ఈ సిరిస్ కు ముందు నవంబర్‌లో ఇండియా Aతో ఆడిన 31 ఏళ్ల వెబ్‌స్టర్… ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 5247 పరుగులు, 148 వికెట్లు పడగొట్టాడు.

ఇక భారత్ విషయానికొస్తే ఆకాశ్ దీప్ గాయం కారణంగా చివరి మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాల్లో ఒకరు మాత్రమే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిడ్నీ టెస్ట్ కు శుభ్ మాన్ గిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రోహిత్ శర్మ చివర టెస్ట్ ఆడడంపై కూడా సందిగ్ధత నెలకొంది.

- Advertisement -

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 : ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

భారత్ ప్లెయింగ్ 11 (అంచ‌నా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (w)/ధృవ్ జురెల్, రోహిత్ శర్మ(సి), నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్/ రవీంద్ర జడేజా, రాణా/ప్రసిధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement