ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 24మందిని ఈ ఉద్యోగాలకు టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి 2022లో జులై 21న నోటీఫికేషన్ విడుదలైంది.
ఈ పరీక్షకు 16381 మంది దరఖాస్తు చేసుకోగా 2022 నవంబరు 7న ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ నెల 7, 8 తేదీల్లో సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ క్రమంలో మంగళవారం తుది ఫలితాలను వెల్లడించారు.