హైదరాబాదులో కొన్ని విలాసవంతమైన సినిమా థియేటర్లు ఉన్నాయి. ఖరీదైన రిక్లైనర్లు.. టాప్-నాచ్ ఇంటీరియర్లతో పూర్తి అయినప్పటికీ, సినిమా ఎక్స్ పీరియెన్స్ లో కోల్పోయిన ఒక అంశం ఓపెన్-ఎయిర్ థియేటర్లో సినిమా చూసే అవకాశం. రాత్రిపూట చల్లటి గాలి, నక్షత్రాల వెలుగులో ఇష్టమైన సినిమాలను చూసే విషయాన్ని ఆలోచించండి. మనకి ఇష్టం అయిన వారితో ఇలాంటి క్లైమేట్ లో సినిమా చూస్తే ఎలా ఉంటుంది? అయితే.. ఇలాంటి కలలు కంటున్న వారంతా సినిమాలను కొత్త రకంగా చూడటానికి రెడీగా ఉండొచ్చు.
హైదరాబాద్‌లో ‘సన్‌సెట్ సినిమా’ అనే ఒక క్లబ్ సినిమాలను చూసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని వన్ బ్రూవరీలో ఉన్న సినిమా డెస్టినేషన్ ఇది. అద్భుతమైన అవుట్డోర్ రూఫ్‌టాప్ సెట్టింగ్, బాలీవుడ్, హాలీవుడ్ల నుండి పాత కల్ట్ క్లాసిక్ సినిమాలు.. అభిమానుల కోరిక మేరకు వారికి ఇష్టమైన సినిమాలతో ఓపెన్-ఎయిర్ మూవీస్ ని చూసే చాన్స్ అందిస్తోంది. సన్‌సెట్ సినిమా క్లబ్ అవుట్డోర్ సీటింగ్ లో.. బీన్ బ్యాగ్‌లు, పరుపులు ఉంటాయి. ఇది మిమ్మల్ని సినిమాటిక్ మ్యాజిక్ ప్రపంచానికి తీసుకెళ్లే అద్భుతమైన అనుభూతిని అందించనుంది.
సన్‌సెట్ సినిమా క్లబ్లో 3 టైప్స్..
- ‘స్కై సినిమా’ విత్ రూఫ్ టాప్ సీటింగ్
- సమ్మర్ నైట్స్ స్పెషల్ గా ‘పిక్నిక్ సినిమాస్’ విత్ బీన్ బ్యాగ్, మెట్రెస్ సీటింగ్ ఉంటుంది.
- వేడిని అధిగమించడానికి, నిర్వాహకులు త్వరలో మూడవ కేటగిరీ ‘బాత్‌టబ్’ సినిమాని కూడా పరిచయం చేస్తున్నారు, ఇందులో సీటింగ్ కోసం ప్రత్యేక పూల్స్ కేటాయించనున్నారు.
టైమింగ్ & టిక్కెట్
- వీకెండ్స్ లో రాత్రి 7 గంటల తర్వాత షో స్టార్ట్ అవుతుంది.
- టిక్కెట్లను వారి వెబ్సైట్లు (సన్‌సెట్ సినిమా క్లబ్), BookMyShow లేదా Zomato ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- రెగ్యులర్ గా సినిమా చూసేవారికి మెంబర్ షిప్ కూడా అందిస్తారు.
- సీటింగ్ సెటప్‌ను బట్టి టిక్కెట్ ధరలు రూ.400 నుండి రూ.1600 వరకు ఉంటాయి.
సన్‌సెట్ సినిమా క్లబ్ సినిమా షెడ్యూల్‌ను తమ వెబ్సైట్లో ముందుగానే పోస్ట్ చేస్తుంది, ప్రధానంగా పాత క్లాసిక్ సినిమాలపైనే దృష్టి సారిస్తుంది.