Friday, November 22, 2024

భయం గుప్పిట ప్రపంచ దేశాలు, మళ్లీ కోరలు చాస్తున్న కరోనా!

ప్రపంచ వ్యాప్తంగా మళ్లి కొవిడ్‌ భయాలు మొదలయ్యాయి. చైనా నుంచి భయానక కథనాలు వస్తుండటం, అమెరికా, జపాన్‌, బ్రెజిల్‌, కొరియా తదితర దేశాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళనలు రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రోజువారి వైరస్‌ పాజిటివ్‌ నమూనాలను జీనోమ్‌ సీక్సెన్సింగ్‌ పరీక్షలకు పంపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు మంగళవారం లేఖ రాసింది. జీనోమ్‌ టెస్టింగ్‌లతో కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడం వీలవుతుందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వారానికి 1200, ప్రపంచంలో 35 లక్షల కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం యాక్టివ్‌ కేసులు 3,490కి పడిపోయాయి. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్‌లోనూ అప్రమత్తత అవసరమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.


ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జనో మిక్స్‌ కన్సార్టియం, లేదా ఇన్సాకాగ్‌ అనేది కొవిడ్‌-19 వైరస్‌లో జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి 50కి పైగా ప్రయోగశాలలతో కూడిన కన్సార్టియం. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అనేది కొత్త వైరస్‌ జాతుల లక్షణాలను గుర్తించడానికి, అర్థంచేసుకోవడానికి ఉపయోగించే సాంకేతికత. అన్ని పాజిటివ్‌ కేసుల నమూనాను అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో మ్యాప్‌ చేసిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు ప్రతిరోజూ పం పాలని కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement