దేశంలో విద్యుత్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, వీటి అమ్మకాలు తగ్గడంలేదు. ద్విచక్ర వాహనాలు, కారు, త్రిచక్ర వాహనాలు, బస్సులు, ఇతర ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు గత సంవత్సరం కంటే పెరుగుతున్నట్లు సొసైటీ ఆఫ్ మన్యూఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) తెలిపింది. 2021లో 78,903 యూనిట్లు అమ్మకాలు జరిగితే, 2022లో ఇప్పటి వరకు 3,17,890 వాహనాలు అమ్మకాలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వీటి అమ్మకాలు 8 నుంచి 9 లక్షల యూనిట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఎస్‌ఎంఈవీ అంచనా వేసింది. టూ వీలర్స్‌లో వరసగా జరిగిన ప్రమాదల వల్ల ఈ సంవత్సరం వాటి అమ్మకాలపై కొంత ప్రభావం పడింది. ఈ సంవత్సరం మార్చిలో 42 వేల టూ వీలర్ అమ్మకాలు జరిగితే, ఏప్రిల్ లో 20 శాతం తగ్గి 32,600 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. పెట్రోల్, డిజీల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నందున కస్టమర్లు ఈవీల కొనుగోళ్లకు ముెెెగ్గు చూపుతున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమ్మకాలు మూడు, నుంచి నాలుగు రేట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ అభిప్రాయపడ్డారు.
ఈ అమ్మకాల్లో రిజిస్ట్రేషన్ అవసరంలేని తక్కవ వేగంతో నడిచే వాహనాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఎలక్ట్రికల్ టూ వీలర్స్ తయారు చేసే కంపెనీల వాహనాల కోసం 45 నుంచి 60 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. పెద్ద కంపెనీల చేతుల్లో 5వేల నుంచి 10 వేల ఆర్డర్లు ఉన్నాయని చెప్పారు. కస్టమర్లు నాణ్యమైన ఈవీ టూ వీలర్స్, కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. వరస ప్రమాదాల వల్ల ఈవీ టూ వీలర్స్ అమ్మకాలు మే నెలలో 20 శాతం తగ్గినప్పటికీ, మళ్లిd పుంజుకున్నాయని ఎస్‌ఎంఈవీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2022 జనవరి నుంచి మే వరకు ఈవీ టూవీలర్స్ అమ్మకాలు 27,751 యూనిట్ల నుంచి 1,98,373 యూట్లకు చేరుకున్నాయని తెలిపింది. త్రీవీలర్స్ అమ్మకాలు 46,525 నుంచి 106,233 యూనిట్లకు పెరిగాయి. కార్లు 3,367 నుంచి 12,601 యూనిట్లకు పెరిగాయి. ఈవీ బస్సుల అమ్మకాలు కూడా గత సంవత్సరం జనవరి- మే నెలల అమ్మకాలు 659 ఉంటే, ఈ సంవత్సరం అదే కాలంలో 1245 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.