Thursday, November 21, 2024

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ పై ముదురుతున్న వివాదం.. బ్యాన్ చేయాలని భారతీరాజా డిమాండ్..

ది ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో అనుకున్నంతా అయ్యింది. ట్రైలర్‌తో రచ్చ రచ్చ అయిన వ్యవహారం… షో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తరువాత మరింత ముదురుతుందని భావించారు. కానీ రిలీజ్ అయిన తరువాత రెండు రోజుల పాటు ఎలాంటి విమర్శలు రాకపోవటంతో… ఇక అంతా సద్దు మనిగినట్టే అనుకున్నారు. కానీ అసలు వివాదం ఇప్పుడే మొదలైంది. ట్రైలర్ రిలీజ్ సమయంలో కేవలం ఎల్టీటీఈని తప్పుగా చూపించారన్న విమర్శలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ షోలో పూర్తిగా తమిళులనే తప్పుగా చూపించారంటున్నారు ఆందోళన కారులు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఎగైనిస్ట్ తమిళ్స్‌ అనే హ్యాస్‌ ట్యాగ్‌ను నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ ఆపకపోతే అమెజాన్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో పలువురు ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరీస్ లో సమంతా తమిళ యువతిగా నెగెటివ్ రోల్‌లో నటించడం పట్ల తమిళనాడు ప్రజలు మండిపడున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సర్కారుతో పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అయినప్పటికీ ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా కూడా మండిపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement