Saturday, November 23, 2024

రష్యా రూబుల్‌ పతనం.. స్విఫ్ట్‌ నుంచి బహిష్కరణే ప్రధాన కారణం

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్న పశ్చిమ దేశాలు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఆంక్షలును విధిస్తున్నాయి. రష్యా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ ఆంక్షల ప్రభావం రష్యా ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది. ఈనేపథ్యంలో సోమవారం రష్యా కరెన్సీ విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలరుతో పోలిస్తే రష్యా రూబుల్‌ మారకపు విలువ 30శాతం క్షీణించి 105.27వద్ద కొనసాగింది. ప్రస్తుతం రూబుల్‌ విలువ డాలరుకంటే అత్యంత కనిష్ఠ స్థితికి చేరుకుంది. రూబుల్‌ పతనం వల్ల రష్యాలోనూ ధరలు భారీగా పెరగనున్నాయి. ఆర్థిక ఆంక్షల ప్రభావం రష్యా ప్రజలపై ప్రభావం చూపనుంది. స్విఫ్ట్‌ నుంచి బహిష్కారంతో రష్యా ఆర్థికవ్యవస్థ కుదేలైంది. 200కుపైగా బ్యాంకులు మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే స్విఫ్ట్‌ సమాచార వ్యవస్థ నుంచి ఆదివారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఐరోపా కమిషన్‌ (ఈసీ) ఈ నిర్ణయం తీసుకున్నాయి. స్విఫ్ట్‌ నుంచి బహిష్కరణ రూబుల్‌ పతనం వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.జీ7 దేశాలతోపాటు భాగస్వామ్యపక్షాలతో కలిసి పుతిన్‌పై అత్యంత కఠిన ఆంక్షలు విధించేందుకు కట్టుబడి ఉన్నామని యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలు..

రూబుల్‌ పతనంతో రష్యా అప్రమత్తమైంది. రూబుల్‌ పతనాన్ని అడ్డుకునే దిశగా రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ వర్గాలు కీలక చర్యలు చేపట్టాయి. 9.5శాతం ఉన్న కీలక వడ్డీ రేటును 20శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రష్యా వద్ద ఉన్న 640 బిలియన్‌ డాలర్ల కరెన్సీ నిలలపై ప్రభావంపడితే ఆర్థిక స్థిరత్వం దెబ్బతినే ప్రభావం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బ్యాంకులకు అధిక నగదు నిలలను సమకూర్చాలని రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. బ్యాంకుల కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలను సులభతరం చేసింది. ప్రజలు తమవద్ద ఉన్నవిదేశీ కరెన్సీలో 80శాతం విక్రయించి రూబుల్‌ను కొనుగోలు చేయాలని సూచించింది.కాగా పలు దేశాలు రష్యా విమానాలను నిషేధించడం ఆ దేశ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. నగదు ఉపసంహరణలపై పరిమితులు విధించే అవకాశం ఉందన్న ఆందోళన రేకెత్తడంతో ప్రజులు ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. ఒక్కరోజులోనే రష్యన్లు 1.3 బిలియన్‌ డాలర్ల నగదు విత్‌డ్రా చేశారని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement