రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. పలు దఫాలుగా చర్చలు జరిపినా విజయవంతం కాలేదు. దీంతో పుతిన్ దూకుడు పెంచుతూ ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాడు. ఎప్పుడు చర్చలు సఫలం అవుతాయి.. ఎప్పుడు ఈ యుద్ధం ముగుస్తుందో అని ప్రతీ ఒక్కరు వేచి చూస్తున్నారు. అయితే పుతిన్ నుంచి వచ్చిన కొన్ని సంకేతాలు యుద్ధం ముగింపు తేదీని తెలియజేస్తున్నాయి. ఉక్రెయిన్‌తో వార్ కారణంగా రష్యా కూడా భారీగా ఆయుధ సామాగ్రి, సైనికులను కోల్పోతున్నది. దీన్ని గ్రహించిన పుతిన్.. మే 9 నాటికి యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్టు సమాచారం.
దీనికి తగినవిధంగా రష్యా ఆర్మీ సన్నాహాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. మే 9న యుద్ధాన్ని ముగించే అవకాశం ఉన్నట్టు ఉక్రెయిన్ ఆర్మీ కూడా అంచనా వేస్తోంది. నాజీ జర్మనీపై విజయం సాధించిన రోజుగా రష్యాలో మే 9న విజయోత్సవ్ జరుపుకుంటారు. ఆ రోజు నాటికి యుద్ధం ముగించాలని రష్యన్ బలగాలకు పుతిన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ లోగా లక్ష్యం పూర్తి చేయాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..