ప్రపంచ దేశాలను కోవిడ్ 19 వైరస్ గడగడలాడించింది. కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు ఎంతో శ్రమించాయి. దాదాపు సంవత్సరంనర తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్ అందజేశారు. చాలా వరకు కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే తాజాగా అమెరికాలో కోవిడ్-19 మహమ్మారి దశ అంతమైనట్లు సీబీఎస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్ అన్నారు.. ఆ దేశంలో కోవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఈ ప్రకటన చేశారు. కొన్ని సమస్యలు ఉన్నా.. పరిస్థితి మాత్రం మెరుగవుతోందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రతి రోజు అమెరికాలో కోవిడ్ వల్ల సగటున 400 మంది మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా మహమ్మారి చివరి దశకు చేరుకున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా వల్ల సుమారు 10 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement