తమిళనాడులో ఏనుగులను సంరక్షిస్తున్న ఒక కుటుంబ నేపథ్యంతో తీసిన డాక్యుమెంటరీ మూవీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ అస్కార్ అవార్డు రావడం విశేషం.. 42 నిమి షాల నిడివి కలిగిన ఈ చిత్రం కథ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరం గా మారింది. రఘు, అమ్ము అనే రెండు అనా థ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన దంప తుల కథే ఈ సినిమా సారాంశం. రెండు ఏను గు పిల్లలు, ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగిన ఈ షార్ట్‌ఫిలిమ్ కోసం దాదాపు 450కిపైగా ఫుటీ జీలు తీశారు. ప్రస్తుతం అనాథ ఏనుగుల సంరక్షణ చూసుకునే వృద్ధ దంపతుల జీవితకథ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుం ది. తమిళనాడులోని ముదుమలై రిజర్వు ఫారెస్టులో మావటిగా పనిచేస్తున్న బెల్లి, బొమ్మన్ దంపతుల వాస్తవ జీవితం ఆధారంగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ లఘు చిత్రాన్ని నిర్మించారు. దీనికి గునీత్ మోగ్న నిర్మాతగా వ్యవహరించ గా, కార్తికి గోంజాల్వెస్ దర్శకత్వం వహిం చారు.
ఆ ఏనుగులే మాకు పిల్లలు..
తమ జీవితగాథకు ఆస్కార్ లభించ డంపై బెల్లి హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ అంటే ఏమిటో తెలీదని, ఏదేమైనా గొప్ప బహుమతి లభించడం సంతోషంగా ఉం దని చెప్పారు. ఈ అద్భుత క్షణాలను పం చుకునేందుకు ఆమె భర్త ఇంటివద్ద లేడు. ప్రమాదంలో ఉన్న ఏనుగును తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లడం గమ నార్హం. బెల్లి మాట్లాడుతూ, ఏనుగులు మాకు పిల్లల వంటివి. తల్లిని కోల్పో యిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావి స్తాం. అలాంటి గున్న ఏనుగులను చేరదీసి సంరక్షిస్తాం. వాటిని మా సొంత పిల్లల్లాగే చూసు కుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదేపని చేసేవారని చెప్పింది. బొమ్మన్ గురించి ప్రస్తావించగా, సమీప పట్ట ణంలో తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఏనుగును తెచ్చేందుకు వెళ్లారని, దానికి సేవలు చేసేందుకు ఉత్సాహంగా వేచిచూస్తున్నామని తెలిపింది.
కాగా,95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్స వంలో మనదేశం నుంచి షార్ట్‌ఫిలిం విభాగం లో నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్‌ను గెలుచుకుంది. దర్శకురాలు కార్తి కి గోన్‌సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్న అవా ర్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఈ డాక్యు మెంటరీ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమిం గ్ అవుతోంది.