Tuesday, October 22, 2024

BAN vs SA | తొలి రోజు బౌల‌ర్ల‌దే హ‌వా !

దక్షిణాఫ్రికా – బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా నేడు జ‌రిగిన తొలి టెస్ట్ లో బౌల‌ర్ల ఆధిప‌త్యం క‌నిపించింది. బంగ్లాదేశ్ మిర్పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే నజ్ముల్ హుస్సేన్ సేన‌.. కేవలం 40.1 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్ మహ్మద్ హసన్ జాయ్ (30) హై స్కోర‌ర్ గా నిలిచాడు. మిగిలిన‌వారు కనీసం 20 పరుగులు కూడా చేయలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ‌రోవైపు ద‌క్షినాఫ్రికా బౌల‌ర్ల‌లో కగిసో రబడ, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్ మూడేవి వికెట్ల‌తో చెలరేగారు.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన స‌ఫారీలు… తొలిరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాపై 6 వికెట్లు కోల్పోయి 34 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టోనీ డి జోర్జి (30) ప‌రుగుల‌తో హై స్కోర‌ర్ గా నిల‌వ‌గా.. ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ప‌రువాలేద‌నిపించారు. ప్ర‌స్తుతం క్రీజ్ లో కైల్ వెర్రెయిన్ (18), వియాన్ ముల్డర్ (17) ఉన్నారు. కాగా, బంగ్లా బౌల‌ర్ల‌లో హసన్ మహమూద్ ఒక్క వికెట్ ద‌క్కించుకోగా… తైజుల్ ఇస్లాం 5 వికెట్ల‌తో విజృంభించాడు.

తొలి ఇన్నింగ్స్‌ మొదటి రోజు స్కోర్ బోర్డ్
బంగ్లాదేశ్ – (106 ఆలౌట్)
సౌతాఫ్రికా – (140/6 – లీడ్ 34)

Advertisement

తాజా వార్తలు

Advertisement