దేశవాళీ క్రికెట్ సీజన్ ఈనెలాఖరులో ప్రారంభం కాబోతున్నది. ముందుగా దులీప్‌ట్రోఫీతో దేశవాళీ మ్యాచ్‌లు మొదలవనున్నాయి. జూన్ 28నుంచి జరిగే ఈ టోర్నీలో వివిధ జోన్లకు చెందిన ఆరు జట్లు పాల్గొంటాయి. నాకౌట్ ఫార్మాట్‌లో జరిగే ఈవెంట్‌కు బెంగళూరు వేదికవుతోంది. సెంట్రల్ జోన్ – ఈస్ట్ జోన్ మధ్య తొలి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఆలూరులో జరగనుండగా, నార్త్‌జోన్ – నార్త్‌ఈస్ట్ జోన్ మధ్య జరిగే రెండవ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహిస్తారు.
ఇక జులై 5న జరిగే సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్ట్‌జోన్ క్వార్టర్‌ఫైనల్-1 విజేతతో తలపడుతుంది. అలాగే, క్వార్టర్ ఫైనల్ 2 విజేతతో సౌత్‌జోన్ ఆడుతుంది. జులై 12-16 మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 15న నాటికి ఆయా జోన్లు 15 మంది సభ్యుల జట్టుతోపాటు సపోర్ట్ స్టాఫ్ వివరాలను అందజేయాలని బీసీసీఐ జనరల్ మేనేజర్ అబేయ్ కురువిల్లా కోరారు.