కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు, సంగీత దర్శకుడు, ఇప్పుడు దర్శకుడు అయినటువంటి విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బిచ్చగాడు 2”. గతంలో వచ్చిన “బిచ్చగాడు” సినిమా తెలుగు సహా తమిళ్ లో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో పార్ట్ 2 ని స్వయంగా విజయ్ ఆంటోనీ నే టేకప్ చేసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. కాగా ఇవ్వాల తెలుగు సహా తమిళ్ లో ఏకకాలంలో ఈ మైవీ రిలీజ్ అయ్యింది.
అయితే, ఈ మూవీ తాలుకా ఓటిటి హక్కులపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్టు తెలస్తోంది. కాగా, ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.