Monday, November 18, 2024

భారీగా పెరిగిన యూఏఈ గోల్డెన్‌ వీసా డిమాండు..

యూఏఈ గోల్డెన్‌ వీసా డిమాండు భారీగా పెరుగుతోంది. యూరోపియన యూనియన్‌ దేశాలు తమ గోల్డెన్‌ వీసా ప్రోగ్రామ్‌లను దశలవారీగా లేదా పౌరసత్వం కోరే వారి కోసం రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో, విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న సంపన్న భారతీయులు మరోసారి అవకాశాల కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వైపు మొగ్గు చూపుతుండటంతో భారీగా డిమాండు పెరిగిందని నిపుణులు అంటున్నారు. మే 2023 నుంచి గోల్డెన్‌ వీసా కోసం అవసరమైన మొత్తాన్ని రెట్టింపు చేస్తామని గ్రీస్‌ ఇటీవల ప్రకటించింది. అయితే, పోర్చుగల్‌, ఐర్లాండ్‌ ఇప్పటికే తమ దీనిపై ముందంజలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు (హెచ్‌ఎన్‌ఐ) ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

ఎందుకంటే ఇది రియల్‌ ఎస్టేట్‌ ఆస్తిలో కేవలం 2 మిలియన్‌ దిర్హామ్‌లు పెట్టుబడి పెట్టడానికి 10 ఏళ్ల రెసిడెన్సీ వీసాను అందిస్తుంది. గోల్డెన్‌ వీసాలలో మార్పులతో కొన్ని ఈయూ దేశాల ద్వారా మనం సాక్షులుగా ఉంటాం. భారతీయుత హెచ్‌ఎన్‌ఐల నుంచి ఆసక్తి పెరిగింది. యూఈఏ గోల్డెన్‌ వీసా రెసిడెన్సీని ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలతో కలుపుతోందని ఇండియా సొథెబైస్‌ ఇంటర్నేషనల్‌ రియాల్టి ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ పూరి అన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి, తదుపరి పరిమితుల తర్వాత రెసిడెన్సీ స్థితిని నిర్ణయించడంలో కదలిక సౌలభ్యం కీలకమైన అంశంగా మారింది.

- Advertisement -

ఇది పోర్చుగల్‌, గ్రీస్‌, స్పెయిన్‌ వంటి ఈయూ దేశాలలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా గోల్డెన్‌ వీసా లేదా రెసిడెన్సీని పొందటం అనేది ప్రజాదరణకు దారి తీసింది. ప్రత్యేకించి హెచ్‌ఎన్‌ఐలు సులభతరమైన కదలికను మరింత సులభతరం చేసే మార్గాన్ని కోరుతున్నారు. అయితే, ఇది ఈయూ దేశాలలో రియల్‌ ఎస్టేట్‌ ధరలను పెంచింది. పెట్టుబడులు పెట్టడానికి లేదా గోల్డెన్‌ వీసా మార్గాన్ని పిలిపివేయడానికి వారిని ప్రోత్సాహించిందని పూరి పేర్కొన్నారు.

దుబాయ్‌కి చెందిన ప్రాస్‌టెక్‌ స్టార్టప్‌ రియలిస్ట్‌ గత కొన్ని నెలలుగా దుబాయ్‌లో భారతదేశం నుంచి పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుదల గమనించినట్లు తెలిపింది. యూరోపియన్‌ దేశాలలో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారులకు గోల్డెన్‌ వీసాలు ఇటీవల ఆపివేయడంఈ ధోరణికి గణనీయంగా దోహదపడిందని రియలిస్ట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్‌ గాల్ట్సెవ్‌ అన్నారు. వాటిలా కాకుండా ప్రత్యేకించి యూఏఈ, దుబాయ్‌లు ఇప్పటికీ ప్రవాసులకు పెట్టుబడులకు బదులుగా నివసం పొందే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇది భారతీయులకు కూడా విలువైన బోనస్‌ అని గాల్ట్సెవ్‌ తెలిపారు.

ప్రస్తుతం అనేక మంది భారతీయులు తమ మూలధనాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. రూపాయి విలువ క్షీణించడం కూడా డిమాండుకు కారణమని చెప్పవచ్చు. వాస్తవ ప్రపంచ డేటా ప్రకారం, దుబాయ్‌ హౌసింగ్‌ మార్కెట్‌ 2023లో 46 శాతం వరకు పెరిగింది. వ్యక్తిగత గోల్డెన్‌ వీసా కోసం అర్హత పొందేందుకు అవసరమైన కనీస పెట్టుబడిని ఈయూఏ 5 మిలయన్‌ దిర్హామ్‌ నుంచి 2 మిలియన్‌ దిర్హామ్‌లకు తగ్గించిందని ఐరిస్‌ సహ వ్యవస్థాపకుడు సాహిల్‌ వర్మ తెలిపారు. నివాస స్థలాలు, వీసా వ్యవిధిని ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పొడిగించారు. ఇది యూరోపియన్‌ దేశాలతో సమానంగా ఉంది. ఇక్కడి నుంచి డిమాండ్‌ పెరుగుతోందని వర్మ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement