ఆస్ట్రేలియా పార్లమెంట్ దిగువ సభకు జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ ఓటమి చవిచూసింది. పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన లేబర్ పార్టీ విజయం సాధించింది. ప్రధాని స్కాట్ మోరిసన్ ఓటమిని అంగీకరించారు. లేబర్ పార్టీ అధినేత ఆంటోనీ అల్బనేస్ మాట్లాడుతూ… దేశాన్ని ఏకం చేస్తానని అన్నారు. కడపటి వార్తలు అందే సమయానికి 151 మంది సభ్యులున్న దిగువ సభలో లేబర్ పార్టీకి 72 సీట్లు వచ్చాయి. మెజారిటీ ఇంకా 4 సీట్ల దూరంలో నిలిచింది. విభజన రాజకీయాలకు స్వస్తి చెబుతాం… ప్రజలందరినీ ఏకతాటిపై నడిపిస్తా అని అల్బనేస్ తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..